చాణక్య నీతి: ఈ నాలుగు రకాల పురుషులను మగువలు దూరం పెడతారు.. అదే జరిగితే జీవించడం వ్యర్థమనుకుంటారు!

ABN , First Publish Date - 2021-11-03T12:33:10+05:30 IST

జీవిత భాగస్వామిగా ఎటువంటి మగువను..

చాణక్య నీతి: ఈ నాలుగు రకాల పురుషులను మగువలు దూరం పెడతారు.. అదే జరిగితే జీవించడం వ్యర్థమనుకుంటారు!

జీవిత భాగస్వామిగా ఎటువంటి మగువను ఎంచుకోవాలో పురుషులకు సూచించిన ఆచార్య చాణక్య.. ఎటువంటి పురుషులకు మహిళలు దూరంగా ఉండాలనుకుంటారో కూడా తెలియజేశారు. సాధారణంగా మహిళలు పురుషుల నుంచి స్వచ్ఛమైన ప్రేమను, నీతి నిజాయితీలను కోరుకుంటారు. అలాగే వారు పురుషులలో మరికొన్ని లక్షణాలను కూడా చూస్తారు. వారు కోరుకునే లక్షణాలు లేని పురుషులను వారు ఎంతమాత్రం ఇష్టపడరు. చాణక్యనీతిలో తెలిపిన వివరాల ప్రకారం మగువలు ఎటువంటి పురుషులకు దూరంగా ఉంటారో ఇప్పుడు తెలుసుకుందాం.. 


డబ్బులేని పురుషుడు

డబ్బులేని పురుషుడిని ఏ మహిళా కోరుకోదు. అటువంటి వ్యక్తికి జీవిత భాగస్వామిగా ఉండాలని భావించదు. డబ్బులేని వ్యక్తి తన భార్య కోర్కెలను ఎన్నటికీ తీర్చలేడు. ఇటువంటి పురుషునితో ఉండటం వలన తమ జీవితం వ్యర్థమని మగువలు భావిస్తారు. ఇటువంటి సందర్భాల్లోనే కొందరు మగువలు.. పరాయి పురుషుని చెంతకు చేరేందుకు ప్రయత్నిస్తారని ఆచార్య చాణక్య తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వృద్ధుడు

వయసుమీద పడిన వ్యక్తి సాంగత్యాన్ని ఏ స్త్రీ కోరుకోదని ఆచార్య చాణక్య తెలిపారు. వృద్ధునితో జీవితం గడపాల్సి వస్తే తన జీవితం వ్యర్థమని స్త్రీ భావిస్తుందని చాణక్య పేర్కొన్నారు. వృద్ధుడైన భర్త తన భార్యను సరిగా చూసుకోలేడు. ఆమెకు కావల్సినవన్నీ సమకూర్చిపెట్టలేడు. అలాగే ఆమెను శారీరంగానూ సంతృప్తి పరచలేడు. అందుకే వయసు మీద పడిన పురుషులు తమ జీవితాన్ని దైవ చింతనకు కేటాయించాలని ఆచార్య చాణక్య సూచించారు. 


నపుంసకుడు

నపుసంకుడైన పురుషుడిని ఏ స్త్రీ కూడా వివాహం చేసుకోవాలని కోరుకోదు. పైగా అటువంటి పురుషుడిని అసహ్యించుకుంటుంది. నపుంసకుడైన వ్యక్తి.. మగువను శారీరకంగా సంతృప్తిపరచలేడు. అటువంటి వ్యక్తిని వివాహం చేసుకోవాలని ఏ స్త్రీ కూడా కోరుకోదని ఆచార్య చాణక్య తెలిపారు. 

బుద్ధిమాంద్యం కలిగిన వ్యక్తి

బుద్ధిమాంద్యం కలిగిన ఫురుషుడిని ఏ మహిళా తన జీవిత భాగస్వామిగా కోరుకోదు. అటువంటి వ్యక్తి తన ఆశలు నెరవేర్చలేడని, కోర్కెలు తీర్చలేడని మహిళ భావిస్తుందని ఆచార్య చాణక్య తెలిపారు. 

Updated Date - 2021-11-03T12:33:10+05:30 IST