జిల్లాలో 625 మందికి అక్రిడిటేషన్లు

ABN , First Publish Date - 2021-07-25T04:45:21+05:30 IST

జిల్లాలో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు 2021-22 సంవత్సరానికి మొదటి విడతలో 625 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు

జిల్లాలో 625 మందికి అక్రిడిటేషన్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ హరికిరణ్‌

కలెక్టర్‌ హరికిరణ్‌

కడప (కలెక్టరేట్‌), జూలై 24 : జిల్లాలో ప్రింట్‌, ఎలకా్ట్రనిక్‌ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్‌ జర్నలిస్టులకు 2021-22 సంవత్సరానికి మొదటి విడతలో 625 మందికి అక్రిడిటేషన్లు మంజూరు చేసినట్లు కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు శనివారం కలెక్టరేట్‌లోని తన ఛాంబరులో కలెక్టర్‌ అధ్యక్షతన జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఏ ఒక్క అక్రిడిటేషన్‌ దరఖాస్తును కూడా తిరస్కరించలేదన్నారు. అక్రిడిటేషన్లు మంజూరు కాని వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్‌ చేసి ఆ కాపీలను కడప సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో అందజేయాలన్నారు. తదుపరి జరిగే సమావేశంలో అర్హత మేరకు అక్రిడిటేషన్లు మంజూరుకు చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో జిల్లా మీడియా అక్రిడిటేషన్‌ కమిటీ సభ్యులు గృహ నిర్మాణ శాఖ పీడీ రాజశేఖర్‌, కన్వీనరు సమాచార, పౌర సంబందాల శాఖ  ఏడీ వేణుగోపాలరెడ్డి, సభ్యులు ఐఅండ్‌ పీఆర్‌ డీఈ భరత్‌కుమార్‌రెడ్డి, డీఎంహెచ్‌వో, కార్మిక శాఖ, సౌత్‌సెంట్రల్‌ రైల్వే, ఆర్టీసీ, వాణిజ్య శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T04:45:21+05:30 IST