పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలు

ABN , First Publish Date - 2022-03-22T04:12:31+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను బకాయిలు విపరీతంగా పేరుకు పోయాయి. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, 16 మండలాలతో పోల్చితే పల్లెల్లోనే ఆస్తిపన్ను అధికంగా వసూలు కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈనెల 20వ తేదీ వరకు ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపాలిటీల్లో 54.24 శాతం నమోదుకాగా గ్రామ పంచా యతీల్లో 73.61 శాతం నమోదైంది. నెలాఖరుకు మరో ఏడు రోజులు మిగిలి ఉండగా మున్సిపాలిటీలలో పెద్ద మొత్తంలో బకాయిలు ఉండే పరిస్థితులు ఉన్నాయి.

పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలు
మంచిర్యాల మున్సిపల్‌ కార్యాలయం

నెలాఖరుతో ముగియనున్న గడువు

పట్టణాలతో పోలిస్తే పల్లెలే నయం

గ్రామ పంచాయతీల్లో 73.61శాతం వసూళ్లు

మున్సిపాలిటీల్లో 54.24 శాతం పన్ను వసూలు

మంచిర్యాల, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మున్సిపాలి టీలు, గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను బకాయిలు విపరీతంగా పేరుకు పోయాయి. జిల్లాలో ఏడు మున్సిపాలిటీలు, 16 మండలాలతో పోల్చితే పల్లెల్లోనే ఆస్తిపన్ను అధికంగా వసూలు కావడం గమనార్హం. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈనెల 20వ తేదీ వరకు ఆస్తిపన్ను వసూళ్లలో మున్సిపాలిటీల్లో 54.24 శాతం నమోదుకాగా గ్రామ పంచా యతీల్లో 73.61 శాతం నమోదైంది. నెలాఖరుకు మరో ఏడు రోజులు మిగిలి ఉండగా మున్సిపాలిటీలలో పెద్ద మొత్తంలో బకాయిలు ఉండే పరిస్థితులు ఉన్నాయి. అదే గ్రామ పంచాయతీల్లో గడువు ముగిసే సమయానికి 90 శాతం మేర వసూళ్లు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మున్సిపాలిటీలకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ.26 కోట్ల 56 లక్షల 2 వేలు ఆస్తిపన్ను డిమాండ్‌ ఉండగా, అందులో ప్రస్తుతం రూ.16 కోట్ల 56 లక్షల 39వేలు కాగా, పాతబకాయి రూ.9 కోట్ల 93లక్షల63వేలు ఉంది. అలాగే గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆస్తిపన్ను మొత్తం డిమాండ్‌ రూ.7కోట్ల 72 లక్షల 86 వేల 627 ఉండగా అందులో ప్రస్తుతం రూ.6 కోట్ల 47 లక్షల 26వేల 281 కాగా పాత బకాయి రూ. 1 కోటి, 25 లక్షల 60వేల 346 ఉంది. 

డివిజన్ల వారీగా పన్ను వసూళ్లు

జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ల పరిధిలో మొత్తం 16 మం డలాల్లో 311 గ్రామ పంచాయతీలున్నాయి. బెల్లంపల్లి డివిజన్‌ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో  మొత్తం డిమాండ్‌ రూ.2 కోట్ల 63 లక్షల 1446 ఉండగా అందులో ఈనెల 20వ తేదీ వరకు ప్రస్తుత పన్ను రూ. 1కోటి 34 లక్షల 52వేల 673 వసూలు కాగా మరో రూ. 18 లక్షల 45వేల 708 వసూలుకాగా మరో 83 లక్షల 91వేల 497 వసూలు కావాల్సి ఉంది. డివిజన్‌లో ఆస్తిపన్ను వసూళ్లు శాతం 67.71 నమోదైంది. అలాగే మంచిర్యాల డివిజన్‌ పరిధిలో రూ.5 కోట్ల 98 లక్షల 5వేల 181 డిమాండ్‌ ఉండగా అందులో రూ.3 కోట్ల 33 లక్షల 93వేల 997 ప్రస్తుత బకాయిలు వసూలు కాగా, మరో రూ.1కోటి కోట్ల 18 లక్షల 54వేల 332 వసూలు కావాల్సి ఉంది. డివిజన్‌లో ఆస్తిపన్ను వసూళ్లు 76.67 శాతం నమోదైంది. 

మండలాల వారీగా ఇలా...

మండలం లక్ష్యం     కలెక్షన్‌    బకాయిలు  శాతం

(రూపాయల్లో)

బెల్లంపల్లి 47,03,832  28,16,138  18,49,594      61.51

భీమిని 18,56,620  16,10,385  2,28,235     87.66

కన్నెపల్లి 8,56,045  6,94,112   98,283     87.60

కాసిపేట 74,41,274 43,26,026  27,25,635   61.87

నెన్నెల 17,76,952  7,90,615  8,75,087     57.04

తాండూరు    86,30,489  43,94,615 23,14,134   72.19

వేమనపల్లి    10,36,234  63,8,025    30,0529  72.57

భీమారం 14,96,972  12,61,992   1,16,839   92.12

చెన్నూరు    47,55,956  38,50,939 8,33,017 82.22

దండేపల్లి    69,40,980 42,53,812  22,41,873 67.18

హాజీపూర్‌ 90,62,228 52,63,431 15,53,411 94.68

జైపూర్‌ 53,44,950 44,09,799 4,24,773 91.21

జన్నారం 1,16,27,325 69,03,546 33,57,409 67.28

కోటపల్లి 32,08,202 20,34,129 12,32,073 63.66

లక్షెట్టిపేట 42,61,381 28,50,120 9,14,697 79.03

మందమర్రి 42,15,187 24,83,688 17,31,449 68.53

మున్సిపాలిటీల్లో వసూళ్లు ఇలా...

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు సంబంధించి ఆస్తిపన్ను డిమాండ్‌ రూ.26 కోట్ల 50లక్షల 2వేలు కాగా, అందులో ప్రస్తుత పన్ను రూ. 16 కోట్ల 56 లక్షల 3వేలు, ఏరియర్స్‌ రూ.9 కోట్ల 93 లక్షల 63వేలు ఉంది. మున్సిపాలిటీల్లో మొత్తం వసూళ్లు రూ. 14 కోట్ల 37 లక్షల, 35వేలు కాగా బకాయిలు రూ.12 కోట్ల 12లక్షల 67వేలు ఉండగా వసూళ్ల శాతం 54. 24 నమోదైంది. 

బెల్లంపల్లి    2,40,84,00     1,69,86,000  70,98,000  70.53

చెన్నూరు     86,58,000     58,99,000  27,59,000  68.14

క్యాతన్‌పల్లి  1,77,86,000    1,13,58,000  64,28,000 63.86 

లక్షెట్టిపేట   2,08,37,000    1,38,00,000 70,37,000 66.23 

మందమర్రి  2,06,88,000     77,44,000 1,29,44,000 37.43 

మంచిర్యాల 14,95,75,000   7,21,37,000  7,74,38,000 48.23  

నస్పూర్‌     2,33,75,000   1,58,11,000  75,64,000     67.64 

నోటీసుల జారీ లేకనే...

గతంలో యేటా మార్చి మాసానికి రెండు నెలల ముందుగానే మున్సిపాలిటీల నుంచి ప్రజలకు ఆస్తిపన్ను డిమాండ్‌ నోటీసులు జారీ అయ్యేవి. వాహనాల ద్వారా పన్ను వసూళ్లకు విస్తృత ప్రచారం చేసేవారు. ప్రస్తుతం ఎక్కడ కూడా నోటీసులు జారీకాకపోగా, ప్రచారం నిర్వహించిన దాఖలాలు లేవు. దీంతో ఆస్తిపన్ను ఎంత చెల్లించాల్సి ఉందో తెలియక   ప్రజలు పన్ను చెల్లించడంలేదు. మంచిర్యాలలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ బదిలీ అయ్యారనే నెపంతో డిమాండ్‌ నోటీసు జారీ చేయలేదని పేర్కొంటున్నారు. మున్సిపల్‌ సిబ్బంది రశీదు పుస్తకాలు ఇంటింటికి తిరుగుతూ బిల్లులు చెల్లించాలని కోరుతుండగా, ఏ ఇంటికి ఎంత పన్ను వేశారో యజమానులకు తెలియక వారు వచ్చినప్పుడు చెల్లించడం లేదు.  మార్చి గడువు ముగిస్తే, ఆ తరువాత ఆస్తిపన్నుపై 2 శాతం వడ్డీ వేస్తుండటంతో ప్రజలపై అధిక భారం పడనుంది.   

Updated Date - 2022-03-22T04:12:31+05:30 IST