ఓనర్‌ హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-27T13:55:31+05:30 IST

ఇంటి యజమాని మంగతాయారును హత్య చేసిన నిందితుడు నాదేం రాజేశ్‌గౌడ్‌ను

ఓనర్‌ హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్ సిటీ/అల్వాల్‌ : కానాజిగూడలోని సత్యసాయి ఎన్‌క్లేవ్‌లో ఇంటి యజమాని మంగతాయారును హత్య చేసిన నిందితుడు నాదేం రాజేశ్‌గౌడ్‌ను అల్వాల్‌ పోలీస్‌లు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. శనివారం అల్వాల్‌ పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో ఏసీపీ రామలింగరాజు, సీఐ గంగాధర్‌ నిందితుడి వివరాలను వెల్లడించారు. 3 నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో చేసిన అప్పులు తిరిగి ఇవ్వాలని వత్తిడి పెరిగి నేపథ్యంలోనే రాజేశ్‌గౌడ్‌ మంగతాయరు హత్యచేసి బంగారు గాజులతోపాటు రింగ్‌ను తీసుకుని కుదవ పెట్టాడని తెలిపారు.

Updated Date - 2021-06-27T13:55:31+05:30 IST