Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్లాస్‌మేట్‌నంటూ ఆమెకు దగ్గరయ్యాడు.. లాంగ్‌డ్రైవ్‌కు ఆహ్వానించి.. తరువాత ఏం చేశాడంటే..

మధ్యప్రదేశ్‌లోని రవు పోలీసులు అత్యాచారం కేసుకు సంబంధించి ఒక యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడు ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంలో ఒక యువతితో స్నేహం చేసి, ఆ తరువాత ఆమెపై అత్యాచారం జరిపాడు. దీనికిముందు ఆమెతో ఫొటోలు తీసుకుని, బ్లాక్‌మెయిల్ చేస్తూ, ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపాడు. బాధితురాలు ఈ ఉదంతంపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. అలాగే అతని ఆచూకీ తెలిపినవారికి బహుమానం కూడా ఫ్రకటించారు.

పోలీసు అధికారి నరేంద్ర రఘువంశీ మాట్లాడుతూ బాధితురాలు, ఆమె తల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చి తాము ముసాఖెడీ ప్రాంతంలో ఉంటామని తెలిపారన్నారు. ఏప్రిల్ నెలలో ఇన్‌‌స్టాగ్రామ్‌ మాధ్యమంలో ఒక యువకుడు తాను స్కూల్ సీనియర్ నంటూ బాధితురాలితో పరిచయం చేసుకున్నాడు. ఈ నేపధ్యంలో ఇద్దరూ ఫోనులో మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ తరువాత ఆ యువకుడు లాంగ్‌డ్రైవ్‌కు వెళదామని ఆమెను ఆహ్వానించాడు. ఈ నేపధ్యంలో వారిద్దరూ రవూ ప్రాంతంలోని పథిక్ లాంజ్‌కు వెళ్లారు. అక్కడ 23 వ నంబరు గదిలో దిగారు. తరువాత ఆ యువకుడు ఆమెపై అత్యాచారం జరిపాడు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలు తీసి, వాటిని ఆమెకు చూపించి బెదిరించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే.. ఈ ఫొటోలను వైరల్ చేస్తానని బెదిరిస్తూ ఆమెపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ పరిస్థితుల్లో ఆమె ఉదాసీనంగా ఉంటుండటంతో ఇంట్లోని వారు ప్రశ్నించగా, ఆమె వారికి జరిగిన సంగతంతా తెలిపింది. దీంతో వారు బాధితురాలితో పాటు పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఆ యువకునిపై ఫిర్యాదు చేశారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement