మహేష్‌ బ్యాంక్‌ కేసులో నిందితురాలి కోసం గాలింపు

ABN , First Publish Date - 2022-01-28T00:48:08+05:30 IST

మహేష్‌ బ్యాంక్‌ కేసులో నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈనెల 11న సిద్ధంబర్‌బజార్‌లో షాజహాన్ బ్యాంక్‌ అకౌంట్ తెరిచింది.

మహేష్‌ బ్యాంక్‌ కేసులో నిందితురాలి కోసం గాలింపు

హైదరాబాద్‌: మహేష్‌ బ్యాంక్‌ కేసులో నిందితురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈనెల 11న సిద్ధంబర్‌బజార్‌లో షాజహాన్ బ్యాంక్‌ అకౌంట్ తెరిచింది. శాన్విక్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో షాజహాన్ అకౌంట్ తెరిచింది. ముంబైకి చెందిన షాజహాన్ కోసం పోలీసుల గాలిస్తున్నారు. నిధులు గోల్‌మాలైన రోజే షాజహాన్‌కు బ్యాంక్ సిబ్బంది ఫోన్‌ చేసింది. బ్యాంక్‌ సిబ్బంది ఫోన్‌ కాల్‌తో ఆమె పరారయింది. షాజహాన్ అకౌంట్ ద్వారా రూ.6.9 కోట్లు నేరగాళ్లు బదిలీ చేశారు. మహేష్‌ బ్యాంక్ ప్రధాన సర్వర్ నుంచి షాజహాన్ అకౌంట్‌కి నిధులు బదిలీ అయినట్లు గుర్తించారు. షాజహాన్‌కు ఫోన్ ఐడీలు, మెయిల్ అడ్రస్‌లను హాకర్స్ మార్చలేదు. షాజహాన్‌కు హాకర్స్‌తో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన సర్వర్‌పై రష్యా, చైనా నుంచి ఆపరేట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇండియాలో హాకర్స్‌కి నైజీరియన్లు సపోర్ట్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.

Updated Date - 2022-01-28T00:48:08+05:30 IST