Oct 9 2021 @ 13:57PM

'ఆచార్య': రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ప్లాన్ ఇదేనా..?

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న సినిమా 'ఆచార్య'. ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ రిలీజ్ విషయంలో మేకర్స్ ఓ క్లారిటీకి వచ్చినట్టు తెలుస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం లేకపోయి ఉంటే మే 13న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఇటీవల షూటింగ్ పూర్తైన ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటుండగా, వచ్చే ఏడాది జనవరి చివరి వారం రిలీజ్ చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోందట. ఈ ఏడాది ఇప్పటికే మీడియం బడ్జెట్ సినిమాలతో పాటు డిసెంబర్ 17న పాన్ ఇండియన్ సినిమా 'పుష్ప' పార్ట్ 1 రిలీజ్ కాబోతోంది. ఇక జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఆల్రెడీ కన్‌ఫర్మ్ చేశారు. అలాగే సంక్రాంతి బరిలో ప్రభాస్, మహేశ్ బాబు, పవన్ కళ్యాణ్ - రానాల మూవీ, వెంకటేశ్ -వరుణ్ తేజ్‌ల 'ఎఫ్ 3'..సినిమాలు దిగబోతున్నాయి. దాంతో మెగాస్టార్ 'ఆచార్య' చిత్రాన్ని జనవరి 26న రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. దీనిపై త్వరలో ఓ క్లారిటీ రానుందని సమాచారం. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డే కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిశర్మ సంగీత దర్శకుడు.