Abn logo
Mar 2 2021 @ 01:11AM

కామ్రేడ్‌ సిద్థతో ఆచార్య

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రానికి సంబంధించిన ఫొటో ఇది. ఇందులో రామ్‌ చరణ్‌ కామ్రేడ్‌ ‘సిద్థ’గా కనిపించనున్నారు. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలోచిత్రీకరణలో జరుగుతోంది. చిరంజీవి, రామ్‌చరణ్‌ కలయికలో వచ్చే సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోను దర్శకుడు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలో రామ్‌ చరణ్‌ భుజంపై చిరంజీవి వేసిన చేయి కనిపిస్తుంది. ‘ఆచార్య సిద్థమవుతున్నాడు’ అని శివ కొరటాల ట్వీట్‌ చేశారు. ‘ఇది కామ్రేడ్‌ సమయం! ఆచార్య సెట్‌లో నాన్న(చిరంజీవి), కొరటాల శివతో ప్రతిక్షణం ఆనందిస్తున్నా’ అని రామ్‌చరణ్‌ తెలిపారు.

Advertisement
Advertisement
Advertisement