మంత్రిగారూ.. విన్నారా..కన్నారా?

ABN , First Publish Date - 2021-10-24T05:19:23+05:30 IST

పేరుకే నియోజకవర్గ కేంద్రం.. కనీసం ఆచం టలో పోలీస్‌ స్టేషన్‌ లేదంటే ఎవరైనా నమ్ముతారా..

మంత్రిగారూ.. విన్నారా..కన్నారా?
ప్రస్తుతం కమ్యూనిటీ హాలులో కొనసాగుతున్న ఆచంట పోలీస్‌ స్టేషన్‌

పరాయి పంచన ఆచంట పోలీస్‌ స్టేషన్‌

అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణ పనులు

నిధుల మంజూరుకాకపోవడమే కారణం


ఆచంట, అక్టోబరు 23 : పేరుకే నియోజకవర్గ కేంద్రం.. కనీసం ఆచం టలో పోలీస్‌ స్టేషన్‌ లేదంటే ఎవరైనా నమ్ముతారా.. కానీ ఇది అక్షరాలా ని జం..మంత్రిగారి ఇలాఖా అయినా అసంపూర్తిగా నిలిచిపోయిన పోలీస్‌ స్టేష న్‌ భవనం ముందుకు సాగడంలేదు. పోలీస్‌ స్టేషన్‌ లేకపోవడంతో గత నా లుగేళ్లగా కమ్యూనిటీ హాలులో పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో కాపులపాలెం ప్రజలకు కమ్యూనిటీ హాలు వినియోగంలోకి రాకుండా పోతోం ది.అయినా ఏ ఒక్కరూ ఆ వైపు చూసిన దాఖలాలే కనిపించడం లేదు..


అసంపూర్తిగా నిలిచిన భవన నిర్మాణం..


ఆచంటలో ఉన్న పోలీస్‌ స్టేషన్‌ శిఽథిలావస్థకు చేరింది. తాత్కాలికంగా ఆచంట కాపులపాలెంలో ఉన్న కమ్యూనిటీ హాలులో పోలీస్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి రూ.1.20 కోట్లు నిధులు మంజూరు కావడంతో పాత పోలీస్‌ స్టేషన్‌ తొలగించి 2018లో అప్పటి మంత్రి పితాని సత్యనారాయణ మోడల్‌ పోలీస్‌ స్టేషన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొదట్లో కాస్త పనులు వేగంగా జరిగినప్పటికి తరువాత నిధులు రాకపోవడంతో నత్తనడకన సాగాయి. ఆ తరువాత మొత్తం పనులు పూర్తిగా నిలిపి వేశారు. దీంతో భవనం అసంపూర్తిగానే మిగిలిపోయింది. శంకుస్థాపన చేసి చేసి మూడేళ్లయినప్పటికి కనీసం సగం పనులు కూడా పూర్తి కాలేదు. నిధులు మంజూరు కాని కారణంగానే కాంట్రాక్టర్‌ పనులు మధ్యలో నిలిపి వేసినట్టు సమాచారం. 


మంత్రుల ఇలాకా.. ఆచంట


ఆచంటలో ఎప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికి మంత్రులే ఉంటారు. అయినా కనీసం పోలీస్‌ స్టేషన్‌  నిర్మించలేని దుస్థితిలో ఉండడం విశేషం. గత టీడీపీ హయాంలో పితాని సత్యనారాయణ మంత్రిగా ఉన్నా రు. ఆయన శంకుస్థాపన చేసి నిర్మాణం ప్రారంభించారు. అనంతరం ప్రభు త్వం మారింది. ఈ సారి అదే నియోజకవర్గం నుంచి మంత్రిగా చెరుకువాడ శ్రీరంగనాథరాజు పీటమెక్కారు. అయితే పోలీస్‌ స్టేషన్‌  భవనం అసం పూర్తిగా ఉన్నా నేటికీ అటు వైపు చూసిన దాఖలాలే లేవు. అయ్యా మంత్రి గారు ఇకనైనా దృష్టి పెట్టండి. అసంపూర్తిగా నిలిచిపోయిన భవనాన్ని పూర్తిచేయాలని పలువురు కోరుతున్నారు. 



Updated Date - 2021-10-24T05:19:23+05:30 IST