తప్పుడు కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2020-07-08T22:41:46+05:30 IST

తప్పుడు కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు: చంద్రబాబు

తప్పుడు కేసులో అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు: చంద్రబాబు

గుంటూరు: వైసీపీ ప్రభుత్వంపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శలు గుప్పించారు. తప్పుడు కేసులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారని చంద్రబాబు మండిపడ్డారు. ఏనాడూ గొడవలకు వెళ్లని కొల్లు రవీంద్రపై హత్యాయత్నం సెక్షన్లు పెట్టి జైలుకు పంపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా కార్యకర్తలు, రాజధాని రైతులు, మహిళలు, రైతుకూలీలపై తప్పుడు కేసులు పెట్టారని. నేరస్థులు అధికారంలోకి వస్తే నిరపరాధులు జైలుకే అనేది దీనిని బట్టే రుజువు అవుతోందని చంద్రబాబు స్పష్టం చేశారు. పెళ్లికి వెళ్లాడని యనమలపై కేసు పెట్టారని, ఫొటో ఎందుకు తీశారంటే అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు పెట్టారని, బీద రవిచంద్రపై శాసన మండలిలోనే మంత్రులే దాడిచేసి కొట్టారని చంద్రబాబు విమర్శించారు. ఇది నేరస్థుల ప్రభుత్వమని, మనం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అందరూ ఐక్యంగా నిలబడాలని చంద్రబాబు సూచించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక పెద్ద సైన్యమని, టీడీపీ కార్యకర్తలు ధైర్యసాహసాలు గల సైనికులు అని చంద్రబాబు అన్నారు. బెదిరిస్తే బెదిరివాళ్లు కాదని, తప్పుడు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటామని, బాధితులకు అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Updated Date - 2020-07-08T22:41:46+05:30 IST