Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహకాల పేరుతో మరోమారు జగన్‌రెడ్డి దగా: అచ్చెన్న

హైదరాబాద్: ఎంఎస్ఎంఈలకు ప్రోత్సహకాల పేరుతో మరోమారు సీఎం జగన్‌రెడ్డి దగా చేస్తున్నారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. శుక్రవార ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇచ్చిన పారిశ్రామిక రాయితీల కన్నా విద్యుత్ చార్జీల రూపంలో పీకుడే ఎక్కువ ఎద్దేవాచేశారు. ఎంఎస్ఎంఈలకు 1600 కోట్ల బకాయిలు ఉంటే ఇచ్చింది 440 కోట్లేనని తెలిపారు. టెక్స్‌టైల్, స్పిన్నింగ్ మిల్లులకు 2 వేల కోట్ల బకాయిలుంటే ఇచ్చింది 684కోట్లేనని చెప్పారు. రకరకాల కొర్రీలతో లబ్ధదారుల సంఖ్యను నాలుగోవంతు కోతకోశారని విమర్శించారు. ప్రభుత్వం నిధులు వైసీపీ నేతలు లూటీ చేయడం వల్లే అరకొరగా రాయితీలు ఇస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Advertisement
Advertisement