ప్రభుత్వంపై నమ్మకం పోయింది: అచ్చెన్న

ABN , First Publish Date - 2021-03-09T19:26:36+05:30 IST

ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది.. విశాఖ స్టీల్ కోసం రాష్ట్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని..

ప్రభుత్వంపై నమ్మకం పోయింది: అచ్చెన్న

విశాఖ: ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పోయింది..  విశాఖ స్టీల్ కోసం రాష్ట్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెంన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అచ్చెన్న మీడియాతో మాట్లాడుతూ..  విశాఖ స్టీల్ కోసం అమృతరావు ప్రాణ త్యాగం, 32 మంది బలదానం చేశారని చెప్పారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణకు కర్త, కర్మ, క్రియ  ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి.అన్నారు.  ప్రజలను మభ్యపెట్టడానికి  వీధి పోరాటాలు  చేశారని  అచ్చెంన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 


జగన్ మోహన్ రెడ్డీ ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే పోస్కో ప్రతినిధులతో సమావేశమయ్యారన్నారు. ముఖ్యమంత్రి అఖిలపక్ష సమావేశం ఎందుకు ఏర్పాటు చేయలేదని ? ప్రశ్నించారు. జగన్మో‌హన్‌రెడ్డికి విశాఖ స్టీల్ ఫ్లాంట్ అంటే భూములే కనపడతున్నాయని  అచ్చెంన్నాయుడు మండిపడ్డారు. కేసుల కోసం కేంద్రానికి భయపడి రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్నారని ధ్వజమెత్తారు. స్టీల్ ఫ్లాంట్ కోసం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాజీనామా చేసిన చోట తెలుగుదేశం పోటీ చెయ్యదన్నారు. భూములు కాజేయలని ముఖ్యమంత్రి ప్రణాళిక వేసుకోవడంతోనే, విశాఖ స్టీల్ ఫ్లాంట్ ఉద్యమానికి సహాకరించడం లేదని ధ్వజమెత్తారు. దొంగ విజయసాయి‌రెడ్డి మాటలు నమ్మితే స్టీల్ ఫ్లాంట్‌ను కాపాడుకోలేమని  అచ్చెంన్నాయుడు  చెప్పారు. సీఎం ఒక ఫేక్ ముఖ్యమంత్రి.. చెప్పేవన్నీ అబద్ధాలే అన్నారు. మాకు ఎన్నికలు ముఖ్యం కాదు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ముఖ్యమని అచ్చెన్న స్పష్టం చేశారు. సీఎం స్టీల్ ప్లాంట్‌పై నాయకత్వం వహించాలని కోరారు. 2003లో ఇదే పరిస్థితి వస్తే ఆనాడు  తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, ఎర్రం నాయుడు కేంద్రం దృష్టికి తీసుకొని వెళ్లి ఆపారని అచ్చెంన్నాయుడు గుర్తుచేశారు.

Updated Date - 2021-03-09T19:26:36+05:30 IST