Abn logo
Oct 23 2021 @ 00:00AM

మొటిమలు ఇలా దూరం!

మొటిమలు కనిపించగానే క్రీములన్నీ వాడేస్తుంటారు. ముఖంపై రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. అయితే ఈ చిట్కాలు పాటించడం ద్వారా మొటిమల సమస్యను తగ్గించుకోవచ్చు. ఏం చేయాలంటే...

  1. నీళ్లు ఎక్కువగా తాగాలి. నూనె పదార్థాలు, వేపుళ్లకు దూరంగా ఉండాలి.
  2. రోజులో కనీసం మూడు, నాలుగు సార్లు ముఖం కడుక్కోవాలి.
  3. కొంతమంది ఐస్‌క్యూబ్స్‌ రబ్‌ చేయడం చేస్తుంటారు. కానీ అది సరికాదు. గ్రేప్స్‌ను గుజ్జుగా చేసి ముఖంపై రబ్‌ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
  4. కీర, ఓట్‌మీల్‌, యోగర్ట్‌... ఈ మూడు కలిపి పేస్టులా చేసి ముఖానికి ప్యాక్‌లా వేయాలి. అరగంట తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి.
  5. తేనెను ముఖానికి రాసుకుని అరగంట తరువాత కడిగేసుకున్నా ఫలితం కనిపిస్తుంది. 
  6. కలబంద ఉన్న జెల్‌ ఏదైనా ఉపయోగించవచ్చు.