పుస్తక పఠనంతో విజ్ఞాన సముపార్జన

ABN , First Publish Date - 2022-01-19T21:44:11+05:30 IST

పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి చదుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని

పుస్తక పఠనంతో విజ్ఞాన సముపార్జన

గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌పర్సన్‌ టీజే పూర్ణమ్మ


సత్యనారాయణపురం, జనవరి 18: పుస్తక పఠనంతో విజ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని, విద్యార్థులు గ్రంథాలయాలకు వచ్చి చదుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్‌పర్సన్‌ టి. జె.పూర్ణమ్మ అన్నారు. సత్యనారాయణపురంలోని చిత్తరంజన్‌ శాఖా గంథ్రాలయాన్ని మంగళవారం ఆమె సందర్శించారు. గ్రంథాలయంలో సదుపాయాలపై పాఠకులను అడిగి తెలుసుకున్నారు. గ్రంథాలయ భవనానికి  మరమ్మతులు చేయిస్తానని, ఫర్నిచర్‌, వసతులను సమకూరుస్తానని తెలిపారు. గ్రంథాలయంలో విజ్ఙాన గ్రంథాలు, పోటీ పరీక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రంథాలయం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కె.నాగరాజు, చిత్తరంజన్‌ గ్రంథాలయ శాఖాధికారి సంపత్‌కుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T21:44:11+05:30 IST