Abn logo
Sep 24 2021 @ 20:52PM

అయ్యన్న కేసులో 41ఏ ప్రకారం వ్యవహరించండి‌: హైకోర్టు

అమరావతి: టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్నపై నమోదైన కేసులో 41ఏ ప్రకారం వ్యవహరించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఇటీవల గుంటూరు జిల్లా నకిరేకల్ పీఎస్‌లో అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదయింది. తనపై నమోదైన కేసులపై హైకోర్టును అయ్యన్నపాత్రుడు ఆశ్రయించాడు. అయ్యన్న తరుపు వాదనలను న్యాయవాది వెంకటేష్ వినిపించాడు. రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని కోర్టుకు న్యాయవాది తెలిపారు. కోడెల వర్ధంతి సభలో సీఎం జగన్‌పై అయ్యన్న చేసిన అనుచిత వ్యాఖ్యలపై మాజీ సర్పంచ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసారు. సీఆర్పీసీ 41ఏ ప్రకారం నోటీసులిచ్చి నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. 

ఇవి కూడా చదవండిImage Caption