Abn logo
Sep 21 2021 @ 01:20AM

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

కలెక్టరేట్‌ ఎదుట బస్వాపురం రిజర్వాయర్‌ నిర్వాసితులతో ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

భువనగిరి రూరల్‌, సెప్టెంబరు 20: కోర్టు ఉత్తర్వులు ఉల్లం ఘించి రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్య లు తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు డిమాండ్‌ చేశారు. బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పో తున్న రైతులు కలెక్టరేట్‌ ఎదుటు సోమవారం ధర్నా చేశారు.  ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిర్వాసితులకు నష్ట పరిహా రం అందచేసిన తర్వాతే రిజర్వాయర్‌ నిర్మాణ పనులు ప్రారంభిం చాలని ఇటీవల హైకోర్టు స్టేటస్‌కో ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. అయినా ఆ ఉత్తర్వులను కాంట్రాక్టర్‌ ఉల్లంఘించి పనులు ప్రారం భిం చడం సరికాదన్నారు. రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులందరికీ  ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లిం చిన తర్వాతే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్‌ పమేలా సత్పథికి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో ఏశాల అశోక్‌, నిర్వాసితులు ఉడుత విష్ణు, ఎం.వెంక టేశ్‌, ఎన్‌ చం ద్రయ్య, ఎం.సత్తమ్మ తదితరులున్నారు.

జర్నలిస్టుల హామీలను అమలుచేయాలి: టీడబ్ల్యూజేఎఫ్‌

 జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయా లని తెలంగాణ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (టీడబ్ల్యూజేఫ్‌) జిల్లా అధ్యక్షుడు కొలుపుల వివేకానంద ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. టీడబ్ల్యూజేఎప్‌ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నల ్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ముత్యాల జలందర్‌, పేరబోయిన నర్సింహులు, చొల్లేటి గోవర్థనా చారి, ఉస్మాన్‌ షరీఫ్‌, వెంకటేశ్‌, సురేశ్‌, రాజు పాల్గొన్నారు.