దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-28T05:38:23+05:30 IST

నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు అన్నారు.

దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి
మంచిర్యాలలో అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు

- జిల్లా వ్యాప్తంగా బీజేపీ నాయకుల నిరసన 

ఏసీసీ, జనవరి 27 : నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై దాడికి పాల్పడిన టీఆర్‌ఎస్‌ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని  బీజేపీ నాయకులు అన్నారు.  జిల్లా కేంద్రంలో గురవారం అర్వింద్‌పై దాడికి నిరసనగా ర్యాలీ నిర్వహించి ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ పార్టీ ఎదుగుదలను ఓర్వలేక తమపార్టీ ప్రజాప్రతినిధులపై టీఆర్‌ఎస్‌ నాయకులు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు.  దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం రాజ్యాంగ విలువలు కాపాడాలని అంబేద్కర్‌ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, మున్నారాజా, శ్రీధర్‌, హరికృష్ణ, ప్రదీప్‌చంద్ర, సత్యనారాయణ, దేవి, బిందు, భవానీ తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి:  రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతుందని బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్‌ అన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కాన్వాయ్‌పై  ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అనుచరులు దాడి చేసినందుకు నిరసనగా గురువారం పాత బస్టాండ్‌లోని తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నోటికి నల్లగుడ్డలు ధరించి బీజేపీ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.  కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్‌, పట్టణ ఉపాధ్యక్షులు అడిచర్ల రాంచందర్‌, , ముడిమడుగుల శ్రీనివాస్‌, నాయకులు నవీన్‌, నర్సింగ్‌, కళ్యాణి, లక్ష్మణ్‌, యుగంధర్‌, బసవరాజు, శ్యాం, రాములు పాల్గొన్నారు. 

తాండూర్‌: ఎంపీ అర్వింద్‌తో పాటు బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ నాయకుల దాడిని నిరసిస్తూ  తాండూర్‌ జాతీయ రహదారిపై గురువారం బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ యకుడు చిలుముల కృష్ణదేవరాయలు, మండల ప్రధాన కార్యదర్శి పెట్టెం విష్ణుకళ్యాణ్‌, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పాగిడి చిరంజీవి, సీనియర్‌ నాయకులు శేషగిరి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఏముర్ల ప్రదీప్‌, మండల ఉపాధ్యక్షుడు సతీష్‌, ఆనంద్‌, నాయకులు భాస్కర్‌గౌడ్‌, రాజలింగు, సోమయ్య, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. 

చెన్నూరు: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌పై జరిగిన దాడికి నిరసనగా గురువారం చెన్నూరు పట్టణంలో బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.  కార్యక్రమంలో  బీజేపీ చెన్నూరు పట్టణాధ్యక్షుడు సుశీల్‌కుమార్‌, జిల్లా ఉపాధ్యక్షుడు రాపర్తి వెంకటేశ్వర్‌, పట్టణ ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్‌, నాయకులు కొంపెల్లి బానేష్‌, పెండ్యాల శ్రీకాంత్‌, గడ్డం మహేష్‌, దమ్మ సంజయ్‌, కొఠారి వెంకటేష్‌, రాజు, సంతోష్‌, అక్షిత్‌శర్మ, ప్రవీణ్‌నాయక్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. 

మందమర్రిటౌన్‌: నిజామాబాద్‌ ఎంపీ అర్వింద్‌ కాన్వాయ్‌పై టీఆర్‌ఎస్‌ నాయకులు  దాడి చేసినందుకు నిరసనగా మందమర్రిలోని జాతీయ రహదారిపై గురువారం బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు రాస్తారోకో వద్దకు వచ్చి బీజేపీ నాయకులను అరెస్టు చేశారు. కార్యక్రమంలో  పార్టీ పట్టణాధ్యక్షుడు మద్ది శంకర్‌, నాయకులు గాజుల ప్రతాప్‌, చేపూరి లక్ష్మణ్‌, రంగు శ్రీనివాస్‌, కూసాల ఓదెలు, సురేందర్‌, చరణ్‌, సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

దండేపల్లి: ఎంపీ ధర్మపురి అర్వింపై జరిగిన దాడి అమానుషం అని  బీజేపీ మండల నాయకులు అన్నారు.  పార్టీ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు.  కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు రవిగౌడ్‌, హరికృష్ణ, కార్తీక్‌, నరేష్‌, మల్లేష్‌, శ్రీనివాస్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Updated Date - 2022-01-28T05:38:23+05:30 IST