అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-08-01T07:18:24+05:30 IST

అనుమతులు లేకుండా వ్యవసాయ భూములలో అక్రమ వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ జి.ఆంజనేయులు తెలిపారు.

అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తే చర్యలు
రికార్డులను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ ఆంజనేయులు

సీఎ్‌సపురం, జూలై 31 : అనుమతులు లేకుండా వ్యవసాయ భూములలో అక్రమ వెంచర్లు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ జి.ఆంజనేయులు తెలిపారు. మండలంలోని కోవిలంపాడు గ్రామంలోని సర్వేనంబర్‌ 212లో అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు వేసిన వారికి శనివారం నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా వెంచర్ల రాళ్లను తొలగించారు. అనంతరం ఆయన కోవిలంపాడు సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయ రిజిస్టర్‌ను, కోవిలంపాడు పంచాయితీ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని వీఆర్వోలు తమ పరిధిలోని భూముల రికార్డులపై అవగాహన కలిగిఉండాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూముల రికార్డులు కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వ భూమిని ఎవరైనా ఆక్రమించారని తెలిస్తే వెంటనే మా దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఐ మల్లికార్జున, సర్వేయర్‌ రాజేష్‌, సర్పంచ్‌ బుజ్జి ఖాదర్‌బీ, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T07:18:24+05:30 IST