కౌన్సిలర్ శివపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-12-29T18:45:13+05:30 IST

హిందూపురంలో 33వ వార్డు కౌన్సిలర్ శివపై బుధవారం పోలీసులకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు.

కౌన్సిలర్ శివపై  చర్యలు తీసుకోవాలి

అనంతపురం: హిందూపురంలో 33వ వార్డు కౌన్సిలర్ శివపై బుధవారం పోలీసులకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. ఈ నెల 23వ తేదీన కౌన్సిలర్ శివ తన ఛాంబర్‌లో ప్రవేశించి వేలు చూపిస్తూ దురుసుగా ప్రవర్తించాడంటూ  కమిషనర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈనెల 27వ తేదీన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలోనూ  ‘‘నీ అంతు చూస్తా..  నీ కథ తేలుస్తా అంటూ’’ తీవ్రస్థాయిలో బెదిరింపులకు గురి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన పట్ల దురుసుగా ప్రవర్తించిన కౌన్సిలర్ శివపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని వన్ టౌన్ పోలీసులకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-12-29T18:45:13+05:30 IST