కాలుష్య కారక కెమికల్‌ కంపెనీలపై చర్య తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-01-24T05:47:14+05:30 IST

భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలోని పలు కాలనీల్లోకి కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా కెమికల్‌ కంపెనీలు విషవాయువులు వదులుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని టీఆర్‌ఎస్‌ యువజన

కాలుష్య కారక కెమికల్‌ కంపెనీలపై చర్య తీసుకోవాలి
ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డికి వినతిపత్రం అందజేస్తున్న నాయకులు

భూదాన్‌పోచంపల్లి, జనవరి 23: భూదాన్‌పోచంపల్లి మునిసిపాలిటీలోని పలు కాలనీల్లోకి కొన్ని రోజులుగా రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా కెమికల్‌ కంపెనీలు విషవాయువులు వదులుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతు న్నారని టీఆర్‌ఎస్‌ యువజన నాయకుడు చింతకింది కిరణ్‌ ఆధ్వర్యంలో నాయ కులు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డిని భువనగిరిలో ఆదివారం కలిశారు. కాలుష్య కారక కెమికల్‌ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. తరుచూ విషవాయువులు వదులుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మండలంలోని  దోతిగూడెం, అంతమ్మగూడెం గ్రామాలకు చెందిన కెమికల్‌ కంపెనీలు వదులు తున్న వ్యర్థ రసాయనాలు భూగర్భజలాలు పూర్తిగా విషతుత్యమవుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ పాక వెంకటేశంయాదవ్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌, కౌన్సిలర్‌ సామల మల్లారెడ్డి, కుడికాల అఖిల బలరాం, కౌరంకొండ శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-24T05:47:14+05:30 IST