కులాల మధ్య గొడవలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-14T04:48:48+05:30 IST

పట్టణంలోని మాలలు, మాదిగల మధ్యన గొ డవలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలని మాల మహానాడు నాయకులు మంచిర్యాల పట్టణ సీఐ ము త్తి లింగయ్యకు మంగళవారం ఫిర్యాదు చేశారు.

కులాల మధ్య గొడవలు సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
సీఐకి ఫిర్యాదు అందజేస్తున్న మాల మహానాడు నాయకులు

పట్టణ సీఐకి మాలమహానాడు నాయకుల ఫిర్యాదు

ఏసీసీ, ఏప్రిల్‌ 13 : పట్టణంలోని మాలలు, మాదిగల మధ్యన గొ డవలు సృష్టించాలని ప్రయత్నాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకో వాలని మాల మహానాడు నాయకులు మంచిర్యాల పట్టణ సీఐ ము త్తి లింగయ్యకు మంగళవారం ఫిర్యాదు చేశారు. అనంతరం పట్టణ కమిటీ సభ్యులు నర్సయ్య, ఎర్రోళ్ల శ్రీనివాస్‌ మాట్లాడుతూ బాబు జగ్జీ వన్‌రామ్‌ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 

మాల మహా నాడుకు చెందిన కొంత మంది వ్యక్తులు వ్యక్తిగతం గా ఎమ్మార్పీఎస్‌ నాయకులకు మెసేజ్‌లు పంపుతూ కులాల మధ్య గొడవలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మంచిర్యాల పట్టణం లో గడిచిన నాలుగేళ్లుగా దళితులందరు ఏకతాటిపై నిలిచి దళిత మహనీయుల జయంతి, వర్థంతి కార్యక్రమాలను ఉమ్మడిగా కలిసి చేసుకుంటున్నట్లు తెలిపారు. గిట్టని కొంత మంది వ్యక్తులు ఈ మధ్య కాలంలో మాల మహానాడు ఎమ్మార్పీఎస్‌ల మధ్యన గొడవలు సృష్టిం చి లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవా లని సీఐని కోరినట్లు తెలిపారు. అనవసరంగా తమ మధ్య చిచ్చురేపి తే సహించేది లేదని వారు ఈ సందర్భంగా హెచ్చరించారు. పోలీసు లకు ఫిర్యాదు చేసిన వారిలో సుదమల్ల దామోదర్‌, ఎర్రోళ్ల నరేష్‌లు ఉన్నారు. 

Updated Date - 2021-04-14T04:48:48+05:30 IST