Advertisement
Advertisement
Abn logo
Advertisement

పనిచేయకుంటే చర్యలు తప్పవు

 డీఆర్‌డీఏ పీడీ కిరణ్‌ 

పంచాయతీ కార్యదర్శులతో సమావేశం

నేరేడుచర్ల, డిసెంబరు 3: ఉపాధి హామీ పనులు చేపట్టకుంటే చర్యలు తప్పవని డీఆర్‌డీఏ పీడీ సుందరి కిరణ్‌కుమార్‌ హెచ్చరించారు. నేరేడుచర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో నేరేడుచర్ల, పాలకవీడు మండలాల కార్యదర్శులతో శుక్రవారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఉపాధి హామీ కింద కూలీలకు 1.18కోట్ల పనిదినాలు కల్పించాల్సి ఉండగా, ఇప్పటి 75శాతం పనులు కల్పించి రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నామన్నారు. పాలకవీడు మండలంలో 57,200 పనిదినాలకు, కేవలం 16వేల పనిదినాలు కల్పించి 37శాతంతో జిల్లాలో 23వ స్థానంలో ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లా పరిషత్‌ సీఈవో జి.సురేష్‌ మాట్లాడుతూ, పనుల పురోగతిపై సమీక్ష సమావేశాల అనంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహించి లక్ష్యాన్ని పూర్తిచేయకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో డీపీవో యాదయ్య, డీఎల్‌పీవో లక్ష్మినారాయణ, ఏపీడీ పెంటయ్య, ఎంపీడీవో శంకరయ్య, విజయకుమారి, సందీ్‌పరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement