రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-04-13T05:30:00+05:30 IST

పట్టణ పరిధిలోని ప్రధాన మార్గాల్లో రోడ్లను ఆక్రమించుకొని క్రయవిక్రయాలు చేపట్టే వ్యాపారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నా భైంసా టౌన్‌ సీఐ ప్రవీణ్‌ వెల్లడించారు.

రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేస్తే చర్యలు
సూచనలు చేస్తున్న టౌన్‌ సీఐ ప్రవీణ్‌

భైంసా, ఏప్రిల్‌ 13 : పట్టణ పరిధిలోని ప్రధాన మార్గాల్లో రోడ్లను ఆక్రమించుకొని క్రయవిక్రయాలు చేపట్టే వ్యాపారులపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నా భైంసా టౌన్‌ సీఐ ప్రవీణ్‌ వెల్లడించారు. మంగళవారం స్థానిక పట్టణ పోలీసు స్టేషన్‌ నుంచి కుభీర్‌ అడ్డా, నిర్మల్‌ క్రాస్‌ రోడ్డు వరకు రోడ్లను ఆక్రమించుకొని వ్యాపారాలు నిర్వహించే వారికి పలు సూచన లు సలహాలు చేశారు. ఇక్కడి నుంచి వ్యాపారులందరు తమ తమ దుకాణాల సరిహద్దు వరకే సరుకులను ఉంచుకొని క్రయ విక్రయాలను చేపట్టాలన్నారు. ఎలాంటి పరిస్థితిలోను దుకాణం సరిహద్దును దాటుకొని రోడ్డుపై సరుకులను ఉంచి వ్యాపారాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని సూచించారు. ప్రధా నరోడ్డు మార్గాల్లో వ్యాపారాలు నిర్వహించే ప్రతి ఒక్క దుకా ణానికి వెళ్లి సంబంధిత విషయంలో సూచనలు ఇచ్చారు. నియమ నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులను తొలగించేందుకు గాను, రాకపోకల విషయంలో సమస్యలను తొలగించేందుకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. 


Updated Date - 2021-04-13T05:30:00+05:30 IST