అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు

ABN , First Publish Date - 2021-01-26T05:53:32+05:30 IST

తీర్థమహోత్సవా లను పుర స్కరించుకుని అసాంఘిక కార్యక్రమా లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయనగరం డీఎస్పీ అనిల్‌ కుమార్‌ అన్నారు.

అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు
తీర్థ మహోత్సవ స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ

  విజయనగరం డీఎస్పీ అనిల్‌కుమార్‌

వేపాడ, జనవరి 25: తీర్థమహోత్సవా లను పుర స్కరించుకుని అసాంఘిక కార్యక్రమా లను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని విజయనగరం డీఎస్పీ అనిల్‌ కుమార్‌ అన్నారు. బల్లంకి గ్రామంలో ఈనెల 26, 27 తేదీల్లో మరిడి మాంబ తీర్థమహోత్సవాన్ని నిర్వహించనున్న నేపథ్యంలో ఆయన సోమవారం ఆ గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. సంప్రదాయబద్ధం గా తీర్థాలను నిర్వహించుకోవాలని కోరారు. కరోనా ప్రభావం ఉన్నందున బంధువులకు పిలుపులు చేయవద్దని, డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌, రికార్డింగ్‌ డ్యాన్సులు, కోడి పందా లు, బల్లాటలు, జూదం వంటి వాటిని ప్రభుత్వం నిషేధిం చిందన్నా రు. ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా అసాంఘిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే, సంబంధిత కమిటీలపై కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ  కార్యక్రమంలో ఎస్‌.కోట సీఐ సింహాద్రి నాయుడు, వల్లంపూడి ఎస్‌ఐ లోవరాజు, సిబ్బంది, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సచివాలయ సిబ్బంది, మహిళా పోలీసులు పాల్గొన్నారు.

  

Updated Date - 2021-01-26T05:53:32+05:30 IST