ఖననాలకు అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-05-06T06:20:05+05:30 IST

పట్టణంలోని శ్మశానవాటికలో చనిపోయిన వారిని పూడ్చడానికి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యా దులు వచ్చాయని, ఇకపై అలా వసూలు చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున హెచ్చరించారు.

ఖననాలకు అధిక డబ్బులు వసూలు చేస్తే చర్యలు
శ్మశానవాటిక సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కమిషనర్‌


మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున

ధర్మవరంఅర్బన్‌, మే 5: పట్టణంలోని శ్మశానవాటికలో చనిపోయిన వారిని పూడ్చడానికి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేస్తున్నట్టు ఫిర్యా దులు వచ్చాయని, ఇకపై అలా వసూలు చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన నేరుగా శ్మశానవాటిక వద్దకు వెళ్లి సిబ్బందితో మాట్లాడారు. ఖననం చేసేందుకు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  గుంత తీయడానికి  రూ.3వేలు మాత్రమే తీసుకోవాలని, అంతకంటే ఎక్కువగా తీసుకోరాదన్నారు. అదేవిధంగా మృతుల బందువులవద్ద కూడా డబ్బులు తీసు కోరాదని సిబ్బందిని హెచ్చరించారు. కరోనా సమయంలో  డబ్బులు వసూలు చేస్తే కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.


Updated Date - 2021-05-06T06:20:05+05:30 IST