Abn logo
Sep 25 2021 @ 00:28AM

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు

వివరాలను తెలుసుకుంటున్న జేసీ సుమిత్‌కుమార్‌



  జేసీ సుమిత్‌కుమార్‌  

చొర్లంగి(ఎల్‌.ఎన్‌.పేట), సెప్టెంబరు 24: గ్రామ సచివాలయాల్లోని సిబ్బంది విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్‌ కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ అన్నారు.  చొర్లంగి, బొత్తాడసింగి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులు, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమయపాలన పాటించాలని సూచించారు. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలను ఆయా శాఖల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీటీ రషీద్‌అహమ్మద్‌, పంచాయతీ కార్యదర్శి బి.శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.