Abn logo
Oct 22 2021 @ 23:43PM

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు

ఇచ్ఛాపురం: ర్యాలీలో పాల్గొన్న వికాష్‌ మర్మట్‌

సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌

ఇచ్ఛాపురం:ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని సబ్‌కలెక్టర్‌ వికాష్‌ మర్మట్‌ తెలిపారు. మిషన్‌ ప్రభుత్వ భూమి సంరక్షణలో భాగంగా శుక్రవారం ఇచ్ఛాపురం  మునిసిపల్‌ కార్యాలయం నుంచి  బస్టాండ్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటుచేశారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ దాసరి రామారావు, డీటీ శ్రీహరి, ఆర్‌ఐ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

సోంపేట: ప్రభుత్వ భూమిని  పరిరక్షిస్తామని  సబ్‌ కలెక్టర్‌ వికాష్‌ మరమ్మట్‌ తెలిపారు.  శుక్రవారం సోంపేటలో  ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. వెంటనే ఆక్రమణలకు తొలగించాలని తహసీల్దార్‌ సదాశివుని గురుప్రసాద్‌ను ఆదేశించారు. అనంతరం పట్టణంలో ప్రభుత్వభూమి పరిరక్షణ పేరుతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆర్‌ఐలు విజయ్‌, కిరణ్‌, సర్వేయర్‌ మల్లిఖార్జున పాణిగ్రాహి పాల్గొన్నారు.

 హరిపురం: మందసలో మిషన్‌ ప్రభుత్వ భూమి సంరక్షణ పేరుతో రెవెన్యూ అధికారులు ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ బి.పాపారావు,  ఆర్‌ఐ రామకృష్ణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.