డంపింగ్‌ యార్డును ఆక్రమిస్తే చర్యలు

ABN , First Publish Date - 2021-08-01T05:49:10+05:30 IST

పురపాలక సంఘానికి చెందిన డంపింగ్‌యార్డు స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి కమిషనర్‌ వెంకటరమణ హెచ్చరించారు.

డంపింగ్‌ యార్డును ఆక్రమిస్తే చర్యలు
యార్డు స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తున్న అధికారులు

శ్రీకాళహస్తి అర్బన్‌, జూలై 31: పురపాలక సంఘానికి చెందిన డంపింగ్‌యార్డు స్థలాన్ని ఎవరైనా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్‌చార్జి కమిషనర్‌ వెంకటరమణ హెచ్చరించారు. పట్టణ శివారుప్రాంతంలోని చిలకమహాలక్ష్మి ఆలయ సమీపంలో ఉన్న మున్సిపల్‌ డంపింగ్‌యార్డును పలువురు ఆక్రమించి ప్రహరీ నిర్మించారు. దీనిపై మీడియాలో కథనాలు రావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ఆ మేరకు నాలుగు రోజుల్లో ఆక్రమణలు తొలగించాలని ఆదేశాలిచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో శనివారం ఇన్‌చార్జి కమిషనర్‌ తొట్టంబేడు తహసీల్దారు పరమేశ్వరయ్య, సిబ్బందితో కలసి డంపింగ్‌ యార్డు వద్దకు వచ్చారు. ఎక్స్‌కవేటర్లతో ప్రహరీని కూల్చుతుండగా, ఆ స్థలం తమదంటూ పలువురు వ్యక్తులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. అయితే అధికారులు ఇదేమీ పట్టించుకోకుండా ప్రహరీని కూల్చి, పురపాలక సంఘానికి చెందిన యార్డు స్థలాన్ని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరిక బోర్డు నాటి వెనుదిరిగారు. 

Updated Date - 2021-08-01T05:49:10+05:30 IST