Advertisement
Advertisement
Abn logo
Advertisement

అక్రమ లేఅవుట్‌పై చర్యలు

అనధికార లేఅవుట్‌లో రాళ్లను తొలగించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిస్తున్న ఎంపీడీవో లీలామాధవి

మదనపల్లె టౌన్‌, నవంబరు 30: నిబంధనలకు విరుద్ధంగా 5.50 ఎకరాల్లో లేఅవుట్‌ వేసి ప్లాట్లు వేసి విక్రయించడంపై అధికారులు చర్య లు తీసుకున్నారు. మదనపల్లె మం డలంలోని సీటీఎం క్రాస్‌రోడ్డు వద్ద ప్రభుత్వ పాఠశాల వెనుకవైపు, పెద్దచెరువు మధ్యన కొత్తవారిపల్లె పంచాయతీ పరిధిలోని సర్వే నెం.811లో ఓ రియల్టర్‌ 5.50 ఎకరాల్లో వెంచర్‌ వేశారు. సుమారు 50 మంది వద్ద అడ్వాన్సులు తీసుకుని అగ్రిమెంట్లు రాసిచ్చారు. ఈ క్రమంలో రిజిస్ట్రేషన్‌ కోసం ప్లాట్లు కొన్నవారు వెళితే అదిగో... ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అడ్వాన్సు ఇచ్చిన కొందరు తహసీల్దార్‌, ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.  కాగా సీటీఎం, కొత్తవారిపల్లె పరిధిలో జాతీయరహదారి పక్కన ఎకరా వ్యవసాయ భూమి ఎంత లేదన్నా రూ.20లక్షలు పలుకుతోంది. దీని ప్రకారం ఐదెకరాలకు రూ.కోటి లెక్క వేసినా రూ.5లక్షలు కన్వర్షన్‌ చెల్లించాల్సి వుంది. కానీ ఈ భూమికి కేవలం రూ.లక్ష మాత్రమే చెల్లించగా, అదికూడా తహసీల్దార్‌ కార్యాలయంలో పెండింగ్‌ ఉంది. ఇకపోతే ఎకరా భూమిపైన అప్రూవల్‌ లేఅవుట్‌ వేయాలంటే గుంటూరులో డీటీపీసీ అనుమతి తీసుకోవాలి. కానీ ఇవేమి లేకుండానే  లేఅవుట్‌ వేసి ప్లాట్లు విక్రయిస్తున్నారు. ఈక్రమంలో ఎంపీడీవో లీలామాధవి, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లుతో కలసి అనధికార లేఅవుట్‌ను పరిశీలించారు. ఇక్కడ గత నెల పంచాయతీ అధికారులతో వచ్చి హెచ్చరిక బోర్డు నాటామన్నారు. కానీ బోర్డు తొలగించి రాళ్లు నాటారన్నారు. వాటిని తొలగించి, రోడ్లను చదును చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ భూమిలో రిజిస్ట్రేషన్‌ను నిలుపుదల చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌కు లేఖ రాస్తామన్నారు.

Advertisement
Advertisement