బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-03-09T06:08:44+05:30 IST

బీసీ కులానికి చెందిన ఓ మహిళకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

  • బీసీ మహిళకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రం జారీ 
  • రెవెన్యూ సిబ్బందిపై చర్యలకు ఆదివాసీ జేఏసీ డిమాండ్‌

వరరామచంద్రాపురం, మార్చి 8: బీసీ కులానికి చెందిన ఓ మహిళకు ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసిన రెవెన్యూ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సోమవారం రేఖపల్లి జంక్షన్‌లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సున్నం వెంకటరమణ మాట్లాడుతూ వడ్డిగూడెం గ్రామ పంచాయతీకి చెందిన మేచర్ల కనకమహాలక్ష్మికి (తండ్రి రామకృష్ణ) ఎస్టీ (నాయకపోడు) కుల ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ అధికారులు జారీ చేశారని అన్నారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఆదివాసీ నాయ కులు కుంజా అనిల్‌, కారం సత్తిబాబు, పాయం లక్ష్మణరావు, సున్నం రాజు, పొడియం రాజు, వేట కాని మల్లయ్య, బురక సారయ్య, పూనెం ప్రదీప్‌ పాల్గొన్నారు. కాగా ఈ విషయమై తహశీల్దార్‌ శ్రీధర్‌ను వివరణ అడగ్గా ఎస్సీ, ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాల నియమ నిబంధనలు 1993ని అనుసరించి మేచర్ల కనకమహాలక్ష్మికి మంజూరు చేసిన కులధ్రువీకరణ పత్రంపై విచారణ ఈనెల 20వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు తహశీల్దార్‌ కార్యాలయంలో చేపడతామని చెప్పారు.

Updated Date - 2021-03-09T06:08:44+05:30 IST