బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు

ABN , First Publish Date - 2022-01-18T05:03:22+05:30 IST

బాల్య వివాహాలను ఎవ్వరూ పోత్సహించరాదని అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్ప వని ఎస్‌ఐ సుభాష్‌చంద్రబోస్‌ పేర్కొన్నారు.

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చర్యలు
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎస్‌ఐ సుభాష్‌చంద్రబోస్‌

వేంపల్లె, జనవరి 17: బాల్య వివాహాలను ఎవ్వరూ పోత్సహించరాదని అలా చేస్తే చట్టరీత్యా చర్యలు తప్ప వని  ఎస్‌ఐ సుభాష్‌చంద్రబోస్‌ పేర్కొన్నారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో గ్రామపెద్దలు, ప్రజలతో అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడుతూ పెళ్లి చేసి పంపిస్తే తమ పనైపో తుందన్న భావనలో బాల్య వివాహాలను ప్రోత్సహిస్తు న్నారని, ఇది సరైంది కాదన్నారు. పిల్లలు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పరిపూర్ణ వ్యక్తులుగా ఎదగడానికి అభివృద్ధి చెందడానికి తగిన రక్షణ పొందే హక్కు ఉందన్నారు. బాలికలు చిన్న వయసులో గర్భం దాల్చడంతో తల్లీబిడ్డలకు ప్రమాదం ఏర్పడుతోందని, పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం, పౌష్టికాహార లోపం, రక్తహీనత వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీసులు, మహిళా సంరక్షణ కార్యదర్శులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-18T05:03:22+05:30 IST