2% దిగువకు యాక్టివ్‌ కేసులు

ABN , First Publish Date - 2021-01-18T07:10:02+05:30 IST

దేశంలో తొలిసారిగా కరోనా యాక్టివ్‌ కేసులు 2 శాతం దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 2.08 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి.

2% దిగువకు యాక్టివ్‌ కేసులు

కొత్తగా 15 వేల కేసులు; 181 మరణాలు


న్యూఢిల్లీ, జనవరి 17: దేశంలో తొలిసారిగా కరోనా యాక్టివ్‌ కేసులు 2 శాతం దిగువకు వచ్చాయి. ప్రస్తుతం 2.08 లక్షల యాక్టివ్‌ కేసులున్నాయి. మొత్తం పాజిటివ్‌ (1,05,57,985)లలో ఇవి 1.98 శాతం. మరోవైపు వరుసగా పదో రోజు 20 వేలలోపే కేసులు నమోదయ్యాయి. శనివారం దేశంలో 15,144 మందికి పాజిటివ్‌ రాగా, 181 మంది చనిపోయారు. మరణాలు 300 లోపు ఉండటం ఇది 23వ రోజు. రికవరీ రేటు 96.58కి చేరింది. దేశం త్వరలోనే కరోనా విముక్తం అవుతుందని బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ (78) ఆకాంక్షించారు. పెద్దఎత్తున ప్రారంభమైన టీకా పంపిణీని ప్రశంసిస్తూ.. పోలియో తరహాలోనే కరోనాపైనా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. అమితాబ్‌ గతేడాది జూలైలో కరోనా బారినపడి కోలుకున్న సంగతి తెలిసిదే. 

Updated Date - 2021-01-18T07:10:02+05:30 IST