Abn logo
Sep 26 2021 @ 01:30AM

ఉద్యమకారిణి కమలా భాసిన్‌ కన్నుమూత

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25: ప్రముఖ మహిళా హక్కుల ఉద్యమకారిణి, కవయిత్రి, రచయిత్రి కమలా భాసిన్‌(75) మరణించారు. కేన్సర్‌ బారిన పడిన ఆమె శనివారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. కమల స్నేహితురాలు, మరో ఉద్యమకారిణి కవితా శ్రీవాస్తవ ట్విటర్‌లో ఈ విషయం తెలిపారు. పితృస్వామ్య వ్యవస్థ నుంచి స్వేచ్ఛను కోరుతూ ఆమె పిలుపునిచ్చిన ‘ఆజాదీ’ ఫెమినిస్టు నినాదం దేశవ్యాప్తంగా అనేక నిరసన ఆందోళనలలో ప్రతిధ్వనించింది. కమలా భాసిన్‌ ‘సేవా మందిర్‌’ పేరుతో ఎన్జీవో స్థాపించి సామాజిక కార్యక్రమాలు చేశారు.