Advertisement
Advertisement
Abn logo
Advertisement

కాంగ్రెస్‌ పార్టీకి కార్యకర్తలే కీలకం

ఎమ్మెల్సీ టీ.జీవన్‌ రెడ్డి

బీర్‌పూర్‌, డిసెబరు 7: కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం రావాలంటే కార్యకర్తలే కీలకం అని ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలకేంద్రంలో  పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం రావాలంటే కార్యర్తలే కీలకం అన్నారు. సభ్యత్వం తీసుకుంటున్న ప్రతి కార్యకర్త ఓ సైనికుడిలా పని చే స్తే పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామాలలో పార్టీ స భ్యత్వాల నమోదు శాతాన్ని పెంచే భాధ్యత నాయకులు తీసుకొని పార్టీ అభివృ ద్ధికి తోడ్పడాలని అన్నారు. అనంతరం ఆయన రైతులను ఉద్దేశించి మాట్లాడు తూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, నెలల తరబడి వరి ధా న్యం కొనుగోలు కేంద్రాలలో ఉన్నా కొనుగోళ్లు జరుపకపోవడం విడ్డూరంగా ఉం దన్నారు. ఇక్కడ రైతులు ఒక్కట్లు ఎదుర్కొంటుంటూ నాయకులు మాత్రం క్యాం ప్‌ల పేరుతో టూర్లు, రీసార్టులలో ఎంజాయ్‌ చేస్తున్నారని విమర్శించారు. ఈ కా ర్యక్రమంలో ఎంపీపీ మసర్తి రమేష్‌, జడ్పీటీసీ పాత పద్మ రమేష్‌, వైస్‌ ఎంపీపీ బల్మురి లక్ష్మన్‌ రావ్‌, కాంగ్రేస్‌ పార్టీ ఉమ్మడి మండలం ప్రచార కమిటీ అధ్యక్షు లు జితేందర్‌ యాదవ్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు చెరుపూరి సుభాస్‌ యాదవ్‌, గ్రామశాఖ అధ్యక్షుడు రాజేశం ఆయా గ్రామాల నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.


Advertisement
Advertisement