కార్యకర్తల్లో దౌర్జన్యాన్ని ఎదిరించే చైతన్యం రావాలి: జితేంద్రగౌడ్‌

ABN , First Publish Date - 2021-12-03T06:31:12+05:30 IST

అధికార పార్టీ దౌర్జన్యాన్ని ఎదిరించే చైత న్యం టీడీపీ కార్యకర్తల్లో రావాలని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు.

కార్యకర్తల్లో దౌర్జన్యాన్ని ఎదిరించే చైతన్యం రావాలి: జితేంద్రగౌడ్‌
సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌

గుంతకల్లు, డిసెంబరు 2: అధికార పార్టీ దౌర్జన్యాన్ని ఎదిరించే చైత న్యం టీడీపీ కార్యకర్తల్లో రావాలని మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు. గురువారం స్థానికంగా ఆయన క్యాంపు కార్యాలయంలో టీడీ పీ మండల, పట్టణ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈసంద ర్భంగా జితేంద్రగౌడ్‌ మాట్లాడుతూ చురుగ్గా వ్యవహరించేవారే పార్టీ  సం స్థాగత ఎన్నికల్లో పాల్పంచుకోవాలని, చుట్టపుచూపు నాయకులు, కార్యకర్త లు పార్టీకి అక్కర్లేదని తెలిపారు. అధికార పార్టీ విధానాలు ప్రజల్లో తీవ్ర ఆ గ్రహాన్ని కలిగిస్తున్నాయన్నారు. రాషా్ట్రన్ని అమ్మేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందన్నారు. పంటలను  కోల్పోయిన రైతులకు ఆదుకోలేదని, వరద బా ధితులను కనీసం పరామర్శించిన పాపానపోలేదన్నారు. కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలివ్వలేని జగన మూడు రాజధానులు ఎన్నడు నిర్మిస్తార ని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ, జగన ప్రజాగ్రహానికి కొట్టుకుపోతారని, చంద్రబాబు నాయుడు మరలా సీఎం అవుతారని తెలియజేశారు. అనంతరం గుంతకల్లు మండల, పట్టణ కమిటీల పదవులకు కార్యకర్తల నుంచి నామినేషన్లు స్వీకరించారు. సమావేశంలో టీడీపీ పరిశీలకుడు బ త్తుల వెంకట రమణ, మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన ఆర్‌ శ్రీనాథ్‌ గౌడు, టీ డీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌, పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్‌, జిల్లా మాజీ కార్యదర్శి కేసీ హరి, పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఆమ్లె ట్‌ మస్తాన యాదవ్‌, గుమ్మనూరు వెంకటేశులు పాల్గొన్నారు. 


మహిళలపై దాడులు సిగ్గుచేటు

స్త్రీల అభ్యున్నతి కోసం పాటుపడుతున్నామని చెప్పుకునే అధికార పార్టీ పరిపాలనలో మహిళలపై దౌర్జన్యాలు, దాడులు సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌ పేర్కొన్నారు. పట్టణంలోని కథల మారెమ్మ దేవాలయం వద్ద 10, 11, 12, 13, 14 వార్డులను కలిపి గౌరవ సభ - ప్రజా సమస్యల చర్చా వేదికను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్ర భుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలిపే లక్ష్యంతో గౌరవ సభలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర, పంట నష్టపరిహా రం, సబ్సిడీ పరికరాల పంపిణీలో ఘోరంగా విఫలమైందన్నారు. పైపెచ్చు వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లను బిగిస్తున్నారన్నారు. మూడేళ్ల కా లం పాలన చేయకముందే రూ.3 లక్షల కోట్ల అప్పుచేశారన్నారు. ఇటువంటి ప్రభుత్వ పరిపాలనలో ఇక రాష్ట్రం బాగుపడేదేమీ ఉండదని, దీన్ని ఎంత తొందరగా వదిలించుకుంటే ప్రజలకు అంత మేలు జరుగుతుందన్నారు.  


Updated Date - 2021-12-03T06:31:12+05:30 IST