Jun 17 2021 @ 21:13PM

తనకొచ్చిన ప్రైజ్‌ మనీని తెచ్చిపెట్టాల్సిందిగా పోలీసులను కోరిన బ్రహ్మాజీ

సోషల్‌ మీడియాలో నటుడు బ్రహ్మాజీ ఎంత యాక్టివ్‌గా ఉంటారో తెలియంది కాదు. కమెడియన్‌ వెన్నెల కిశోర్‌తో కలిసి ఆయన వేసే పంచులు నెటిజన్లను ఆకర్షించడమే కాకుండా.. నవ్వును తెప్పిస్తుంటాయి. హీరోలు కూడా బ్రహ్మాజీ పోస్ట్‌లకు కామెంట్స్‌ చేస్తుంటారంటే.. ఎంతగా ఆయన సోషల్‌ మీడియాని వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. సెల్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమయంలో వచ్చే మెసేజ్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన బ్రహ్మాజీ.. ఆ మెసేజ్‌పై కంప్లయింట్‌ కాకుండా చమత్కారంగా పోలీసుల సహాయం కోరడం ఇప్పుడు నెటిజన్లను ఆకర్షిస్తోంది. మీరు ఫోన్‌ నెంబర్‌ ఇంత ప్రైజ్‌ మనీకి సెలక్ట్‌ అయ్యిందంటూ.. ఫోన్లకు స్పామ్‌ మెసేజ్‌లు వస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. అందరూ చూసినవే. ఇలాంటి మెసేజ్‌ని ట్విట్టర్‌ వేదికగా షేర్‌ చేసిన బ్రహ్మాజీ.. ఆ మనీని తెచ్చిపెట్టాల్సిందిగా హైదరాబాద్‌ పోలీసులను కోరాడు. ఏ నెంబర్‌ నుంచి ఆ మెసేజ్‌ వచ్చిందో.. తెలుపుతూ పోలీసులను పై విధంగా బ్రహ్మాజీ రిక్వెస్ట్ చేశాడు. దీనికి నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హైదరాబాద్‌ పోలీసులు కూడా రియాక్ట్‌ అయ్యారండోయ్‌.