Abn logo
Oct 27 2021 @ 20:31PM

కాంగ్రెస్‌లో చేరిన నటి కామ్య పంజాబి

ముంబై: టీవీ నటి కామ్య పంజాబి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముంబై కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగ్‌తప్ సమక్షంలో ఆమె బుధవారంనాడు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాజకీయ విశ్లేషకుడు తెహ్సీన్ పూనావాలా, పలువురు కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా హాజరయ్యారు. ఐఎన్‌సీ ముంబై కుటుంబంలో కామ్య పంజాబీ చేరడం సంతోషంగా ఉందని తహ్సీన్ పూనావాలా ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ స్ఫూర్తితో, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రజలకు సేవలందించాలనే తపనతో ఆమె కాంగ్రెస్ కుటుబంలో చేరారని తెలిపారు. కామ్య పంజాబీ పలు టీవీ సీరియల్స్‌లో నటించడంతో పాటు రియాల్టీ షో 'బిగ్ బాస్'లో కూడా పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption