Abn logo
Apr 9 2020 @ 22:20PM

సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌కు సీరియస్

సీనియర్ నటుడు నర్సింగ్ యాదవ్‌కు సీరియస్‌గా ఉన్నట్లుగా సమాచారం. ఈరోజు (గురువారం) ఆయన తన ఇంట్లో నాలుగు గంటల సమయంలో సడెన్‌గా పడిపోవడంతో, తీవ్ర గాయాలు అయ్యాయని, వెంటనే సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌లో చేర్చారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందుతుందని, పరిస్థితి కొంచెం సీరియస్‌గానే ఉందని, ఆయనకు చికిత్స అందించిన డాక్టర్స్ తెలిపినట్లుగా సమాచారం. కమెడియన్‌గా, విలన్‌గా అనేక పాత్రలలో నటించిన నర్సింగ్ యాదవ్.. రామ్ గోపాల్ వర్మ చిత్రాలలో రెగ్యులర్‌గా ఉండే నటులలో ఒకరు. అనేక భాషల్లో ఆయన నటించారు.


పడిపోలేదు.. కోమాలోకి వెళ్లిపోయారు: నర్సింగ్ యాదవ్ భార్య

‘‘నా భర్త సాయంత్రం 4 గంటలకు అపస్మారక స్థితిలోకి వెళ్ళాడు. దీంతో మేము సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించాము. ఈరోజు ఉదయం కూడా డయాలసిస్ చేయించాము. అనుకోకుండా కోమాలోకి వెళ్లిపోయాడు. 48 గంటల పాటు అబ్జర్‌వేషన్‌లో ఉంచారు. ఇంకా వెంటిలేటర్ పైనే చికిత్స కొనసాగుతుంది. ఇంట్లో కింద పడిపోయాడు, తలకి గాయం అయ్యింది అని వస్తున్న వార్తలు అవాస్తవం. తను ఎక్కడా పడిపోలేదు. ఉన్నట్లు ఉండి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోలుకుని తను ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాం. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఎవరూ నమ్మకండి. క్షేమంగా ఇంటికి రావాలని అందరూ కోరుకోండి..’’ అని నర్సింగ్ యాదవ్ భార్య చిత్రయాదవ్ అతని ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు.

Advertisement
Advertisement
Advertisement