Advertisement
Advertisement
Abn logo
Advertisement

సైనా x సిద్దార్థ్‌

నటుడి వివాదాస్పద ట్వీట్‌ ఫమహిళా కమిషన్‌ ఆగ్రహం 

న్యూఢిల్లీ: షట్లర్‌ సైనా నెహ్వాల్‌పై నటుడు సిద్దార్థ్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారానికి దారి తీసింది. సిద్దార్థ్‌ ద్వందార్థం ధ్వనించేలా అశ్లీలమైన భాషను ఉపయోగించడంపై మహిళా సంఘా లు భగ్గుమన్నాయి. పంజాబ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా చోటు చేసుకొన్న భద్రతా వైఫల్యాన్ని ఖండిస్తూ బీజేపీ సభ్యురాలు కూడా అయిన సైనా నెహ్వాల్‌ ట్వీట్‌ చేసింది. ‘దేశ ప్రధానికే తగిన భద్రత లేనప్పుడు ఆ దేశం క్షేమంగా ఉందని ఎలా అనుకోగలం. ప్రధానిపై అరాచక శక్తుల పిరికిపంద చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా’ అని సైనా ట్వీట్‌ చేసింది. దీనికి సమాధానంగా  ‘చిన్న కాక్‌తో ఆడే ప్రపంచ చాంపియన్‌. దేవుడి దయవల్ల భారత్‌ను కాపాడేవారు ఉన్నారు’ అని సిద్దార్థ్‌ ట్వీట్‌ చేయడం వివాదాస్పదమైంది.

మహిళను కించపరిచే విధంగా ‘కాక్‌’ అంటూ జుగుప్సాకరమైన భాషను వాడడంపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సిద్దార్థ్‌ అకౌంట్‌ను బ్లాక్‌ చేయాల్సిందిగా ట్విటర్‌ను కోరడమే కాకుండా.. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని మహారాష్ట్ర పోలీసులకు లేఖ రాసింది. సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ కూడా ఈ పోస్టును తప్పుబట్టాడు. సిద్ధార్థ్‌ మంచిభాష వాడి ఉండాల్సిందని అన్నాడు. కాగా, సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన ట్వీట్‌కు తప్పుడు అర్థం ఆపాదిస్తున్నారంటూ సిద్దార్థ్‌ వివరణ ఇచ్చాడు. ‘కాక్‌ అండ్‌ బుల్‌’ అని ఉదహరిస్తూ ట్వీట్‌ చేశానన్నాడు. ఎవరినీ కించపరచాలనే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. 


గౌరవమైన భాష వాడాల్సింది

అతడు ఏ ఉద్దేశంతో అన్నాడో స్పష్టంగా అర్థం కాలేదు. ఓ నటుడిగా అతడిని అభిమానిస్తా. కానీ, ఇది ఏమాత్రం బాగోలేదు. తన భావాల్ని వ్యక్తపరచడానికి మరింత మంచి పదాలను ఉపయోగించి ఉండొచ్చు. ఇలాంటి పదాలు, వ్యాఖ్యలకు అర్థం ట్విటర్‌, మీడియాకు తెలిసి ఉండొచ్చని అనుకుంటున్నా. 

 - సైనా నెహ్వాల్‌

Advertisement
Advertisement