Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 20 2021 @ 11:12AM

ఐటీ దాడుల తరువాత సోనూసూద్ ఎమోషనల్ ట్వీట్!

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇళ్లపై ఆదాయపు పన్నుశాఖ దాడులు చేసి, ఆయన రూ. 20 కోట్ల మేరకు పన్ను ఎగ్గొట్టినట్లు తెలిపింది. సోనూసూద్ కరోనా కాలంలో విదేశాల నుంచి నిబంధనలకు విరుద్ధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించారని ఐటీ అధికారులు తేల్చిచెప్పారు. దాదాపు 4 రోజుల పాటు ఐటీ అధికారులు సోనూసూద్‌ను ప్రశ్నించారు.

ఐటీ దాడుల అనంతరం తాజాగా సోనూసూద్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఎమెషనల్ పోస్టు పెట్టారు....‘ప్రతి భారతీయుని ప్రార్థనల ప్రభావం ఎంతలా ఉంటుందంటే... అధ్వాన్నంగా ఉన్న రోడ్లలో కూడా ప్రయాణం అత్యంత సులభమవుతుంది’  అని పేర్కొన్నారు. అలాగే ‘ నీలోని నిజాయితీ గాథను నువ్వు చెప్పుకోనక్కరలేదు. కాలమే వెల్లడిస్తుంది. దేశంలోని ప్రజలకు సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. అదే నాకు బలాన్నిస్తుంది. నా ఫౌండేషన్ తరపున ఖర్చుచేస్తున్న ప్రతీ రూపాయీ ఒక విలువైన జీవితాన్ని కాపాడటంతో పాటు అర్హులకు చేరుతుంది. ఇదేవిధంగా నేను మద్దతు పలుకుతున్న బ్రాండ్‌ల నుంచి వస్తున్న ఆదాయాన్ని అవసరాల్లో ఉన్న అర్హులకు అందిస్తుంటాను. ఇది నిర్విరామంగా కొనసాగుతుంటుంది. గడచిన నాలుగు రోజులుగా నేను బిజీగా ఉన్నాను. కొంతమంది అతిథుల కారణంగా ప్రజలకు సేవలు అందించలేకపోయాను. మళ్లీ తిరిగి వచ్చి మీకు సేవలు అందిస్తాను. నా జర్నీ ఇలాగే కొనసాగుతుంటుంది... జై హింద్... సోనూసూద్’ అని రాశారు. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement