Abn logo
Sep 19 2021 @ 15:59PM

HERO VIJAY : తల్లిదండ్రులపై కేసు వేసిన తమిళ స్టార్

చెన్నై : తమిళ సూపర్‌స్టార్ విజయ్ స్వంత తల్లిదండ్రులకి వ్యతిరేకంగా కోర్టు మెట్లెక్కారు. చెన్నైలోని ఓ లోకల్ కోర్టులో ఆయన సివిల్ కేసు వేశారు. విజయ్ తన తల్లిదండ్రులు సహా మొత్తం 11 మంది, ఇక పై తన పేరుని వాడుకోకుండా, కోర్టుని ఆశ్రయించారు. 


విజయ్ తాజా చర్యకు కారణం... ఇళయ దళపతి ఫ్యాన్స్‌కు చెందిన ఓ రిజిస్టర్డ్ సొసైటీకి స్థానిక ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఆయన తల్లిదండ్రులు అనుమతినిచ్చారు. దాంతో కొందరు తాము విజయ్ అభిమానులమంటూ ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతున్నారు. సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారు. ఇలా తన పేరు పొలిటికల్ మీటింగ్స్‌కి వాడుకోవటంపై అభ్యంతరం తెలియజేస్తూ విజయ్ కోర్టును ఆశ్రయించారు.


విజయ్ తన తల్లిదండ్రులతో సహా మరికొందరిపై వేసిన కేసు సెప్టెంబర్ 27న విచారణకు రావచ్చంటున్నారు.   

ఇవి కూడా చదవండిImage Caption