సినీ కళాకారులందరికీ హెల్త్‌కార్డులు

ABN , First Publish Date - 2020-12-01T05:48:21+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా సినీ కళాకారులందరికీ హెల్త్‌కార్డులు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ తెలిపారు.

సినీ కళాకారులందరికీ హెల్త్‌కార్డులు
యాదగిరిగుట్టలో సినీ కళాకారుడికి గుర్తుపు కార్డు అందజేస్తున్న చైర్మన్‌ రామకృష్ణగౌడ్‌

రాష్ట్ర ఫిలిం ఛాంబర్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌

యాదాద్రి రూరల్‌, నవంబరు 30: రాష్ట్ర వ్యాప్తంగా సినీ కళాకారులందరికీ హెల్త్‌కార్డులు అందజేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఫిలిం ఛాంబర్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ తెలిపారు. యాదగిరిగుట్ట మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సినీ పరిశ్రమలోని 24రంగాల్లో పనిచేసే కళాకారులకు జీవితాంతం హెల్త్‌కార్డు ఉంటుందని తెలిపారు. గుర్తింపు కార్డు పొందిన కళాకారులు హెల్త్‌కార్డుకోసం దరఖాస్తు చేసుకోవాలని, హెల్త్‌కార్డుతో రూ.5లక్షల వరకు వైద్యసదుపాయం, మరో రూ.5లక్షలు ఆయుష్మాన్‌ భారత్‌ పథకం ద్వారా ఆర్థిక సహకారం అందుతుందని తెలిపారు. డిసెంబర్‌ 2వ తేదీవరకు హెల్త్‌కార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఇప్పటివరకు సుమారు 12వేల మంది కళాకారులకు హెల్త్‌, ఆయుష్మాన్‌ కార్డులను ఇప్పించినట్లు ఆయన తెలిపారు. కళాకారులకు ఇళ్ల స్థలాల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇటీవల నివేదిక ఇవ్వగా, ఐదు ఎకరాల స్థలం ఇవ్వడానికి సుముఖంగా ఉన్నారని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర ఫిలిం చాంబర్‌ వైస్‌ చైర్మన్‌ గురురాజ్‌, శ్రీరాంమూర్తి, సోగ్గాడే శోభన్‌కృష్ణ చిత్రం హీరో రాయగిరి ఉమాపతిగౌడ్‌, కళాకారులు గడ్డమీది సత్యనారాయణగౌడ్‌, రాయగిరి జగదీ్‌షగౌడ్‌, రాయగిరి నందకిషోర్‌గౌడ్‌, వెంకట్‌రెడ్డి, శిఖ గణేష్‌గౌడ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-01T05:48:21+05:30 IST