May 7 2021 @ 00:07AM

కరోనాతో నటి అభిలాషా పాటిల్‌ మృతి

బాలీవుడ్‌ నటి అభిలాషా పాటిల్‌ (40) కరోనాతో ప్రాణాలను కోల్పోయారు. గత మూడురోజులుగా కరోనాతో పోరాడుతూ బుధవారం ఆమె తుదిశ్వాస విడిచారు. మరాఠా సీరియల్‌ ‘బాప్‌ మనుస్‌’, సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ హీరోగా నటించిన ‘చిచోరే’ చిత్రాలు నటిగా ఆమెకు మంచి పేరుతెచ్చాయి.