స్విమ్‌ సూట్‌లో హాట్ హాట్‌గా భూమిక.. ఈ వయసులో అవసరమా!?

ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు కొత్తపాత అనే తేడా లేకుండా ఎక్స్‌పోజింగ్‌పై ఆసక్తి చూపుతున్నారు. స్విమ్‌ సూట్‌ ధరిస్తూ, తమ అందాలను ఆరబోస్తున్నారు. పలువురు కొత్త హీరోయిన్లు అవకాశాల కోసం ఎక్స్‌పోజింగ్‌నే నమ్ముకుంటే, కొందరు సీనియర్‌ హీరోయిన్లు సైతం ఇదే పంథాలో వెళ్తున్నారు. తాజాగా నటి భూమిక చావ్లా స్విమ్‌ సూట్‌లో ఈత కొలనులో కనిపించి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. నాలుగు పదులు దాటిన వయసులో కూడా భూమిక స్విమ్‌ సూట్‌తో ఫొటోలకు ఫోజులిచ్చి వాటిని తన సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేయడంతో అవి వైరల్‌ అయ్యాయి.  


ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు 43 యేళ్ళ వయసులో ఇలాంటి ఫొటోషూట్‌ అవసరమా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఒకప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోల చిత్రాలలో భూమిక హీరోయిన్‌గా నటించింది. వివాహం తర్వాత కూడా ఆమె అనేక భాషల చిత్రాల్లో నటిస్తూనే ఉంది. కాగా, ఇటీవల వచ్చిన గోపీచంద్ ‘సీటీమార్’ చిత్రంలో అతనికి అక్కగా నటించిన భూమిక.. ‘ఇదే మా కథ’లో ఓ కీలక పాత్రలో నటించింది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌ నటిస్తున్న ‘కన్ననై నంబాదే’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తోంది.


Advertisement