Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లిలో వీళ్లిద్దరూ ఎంత హ్యాపీగా కనిపించారో.. తాజాగా ఆ భార్య బయటపెట్టిన నిజాలు విని..

సినిమారంగంలోని ఓ యువ హీరో భార్య తన భర్త, అత్త-మామలపై గృహహింస కేసు పెట్టింది. పోలీసులు ఆమె ఫిర్యాదు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు. త్వరలోనే ఆ యువ హీరోని కూడా అరెస్టు చేయవచ్చునని సమాచారం.


మరాఠీ సినిమాలలో పేరు గాంచిన యువనటుడు అనికేత్ విశ్వాప్ రావ్‌కు టీవీ సీరియల్ నటి స్నేహతో 2018లో వివాహమైంది. ఇద్దరు కలిసి కొన్ని టీవి షోలలో కూడా కనిపించారు. కానీ గత రెండు సంవత్సరాలుగా వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్న విషయం మీడియాలో అప్పడప్పుడూ వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. గత బుధవారం స్నేహ తన భర్త, అత్తమామలపై గృహహింస కేసు పెట్టింది.


స్నేహ ఫిర్యాదు ప్రకారం నటుడు అనికేత్ వివాహమైన కొద్దికాలం నుంచి తనపై ఆంక్షలు విధిస్తున్నాడని పేర్కొంది. తను ఇక సీరియల్, సినిమాలలో నటించడం మానేయాలని ఒత్తిడి చేస్తున్నారని చెప్పింది. ఇదంతా తన అనికేత్ తల్లిదండ్రలు మొదలు పెట్టారని, వారికి తాను నటిగా పనిచేయడం ఇష్టం లేదని తెలిపింది. ఈ విషయంలో తాను వారు విధించిన ఆంక్షలను పాటించకపోయేసరికి తనని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని పోలీసులకి చెప్పింది.


మరాఠీ సినీ జగత్తులో పేరుగాంచిన అనికేత్ లాంటి నటుడి భార్య ఇలా తానే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన భర్తపై ఫిర్యాదు చేయడంపై ప్రస్తుతం ముంబై మీడియా వేడి వేడిగా కథనాలు ప్రసారం చేస్తోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement