దుర్గమ్మను దర్శించుకున్న నటి Hema

ABN , First Publish Date - 2021-10-14T15:40:37+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను నటి హేమ గురువారం ఉదయం దర్శించుకున్నారు.

దుర్గమ్మను దర్శించుకున్న నటి Hema

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను నటి హేమ గురువారం ఉదయం దర్శించుకున్నారు. దర్శనానంతరం హేమ మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరాలో ప్రతీ ఏటా అమ్మవారిని దర్శించుకుంటానని తెలిపారు. కొండంత ధైర్యం ఇవ్వమని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు. మా ఎలక్షన్స్‌లో రాత్రి గెలిచాము ఉదయం ఓడిపోయాము..ఏం జరిగిందో ఆ అమ్మవారికే తెలియాలని అని హేమ పేర్కొన్నారు. 

Updated Date - 2021-10-14T15:40:37+05:30 IST