Abn logo
May 9 2021 @ 00:00AM

కరోనా బాధితులకు ప్రాణవాయువు

కొవిడ్‌ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై హీరోయిన్‌ ప్రణీతా సుభాష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రణీత ఫౌండేషన్‌ ద్వారా ఆక్సిజన్‌ సిలిండర్లను అందించేందుకు విరాళాలు సేకరిస్తున్నామని సెలబ్రిటీలతో పాటు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ఆమె ప్రజలను కోరారు. గతేడాది లాక్‌డౌన్‌ సమయంలో ప్రణీత అన్నదానం చేసి నిరుపేదల ఆకలి తీర్చారు. ఈసారి ఆక్సిజన్‌ సిలిండర్ల కొరత ఎక్కువగా ఉండటంతో ఈ సమస్యపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. అలానే సీనియర్‌ బాలీవుడ్‌ నటి రవీనా టాండన్‌ ఓ స్వచ్ఛంద సంస్థతో కలసి కొవిడ్‌ బాధితులకు అండగా నిలిచారు. తనవంతుగా కొన్ని ఆక్సిజన్‌ సిలిండర్లను పంపిణీ చేశారు.