Aug 2 2021 @ 20:24PM

సోలో పాత్రలో.. ప్రియాంక ప్రయోగం

ఒకరు మాత్రమే నటించే చిత్రాలు అప్పుడప్పుడూ ప్రయోగాత్మకంగా వస్తుంటాయి. ఆ కోణంలో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఒత్త చెరుప్పు’. పార్తీపన్‌ హీరో. ప్రతి ఒక్కరి ప్రశంసలు అందుకుంది. ఓ విభాగంలో జాతీయ అవార్డును సైతం గెలుచుకుంది. ఇదిలావుంటే, ఇప్పుడు అలాంటి చిత్రం ఒకటి నిర్మితమవుతోంది. ఈ సోలో పాత్రలో నటి ప్రియాంక నటిస్తోంది. తమిళం, మలయాళం భాషల్లో రూపొందే ఈ చిత్రాన్ని అభిలాష్‌ షోత్తమన్‌ నిర్మించి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రతాప్‌ నాయర్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తుండగా, దీపన్‌ కురన్‌ కథను సమకూర్చి సంగీతం అందిస్తున్నారు. 


ఈ చిత్రం గురించి హీరోయిన్‌ ప్రియాంక మాట్లాడుతూ.. ‘‘సోలో పాత్రల్లో సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి చిత్రాల్లో నటించడం కూడా నటీనటులకు ఎంతో సవాల్‌తో కూడుకున్న పని అయినప్పటికీ, అలాంటి కథా పాత్రల్లో నటించిన తర్వాత ఎంతో తృప్తినిస్తాయి. మలయాళంలో ‘ప్రాణ’ అనే చిత్రంలో నిత్యామీనన్‌ నటించింది. ఒక క్లిష్టమైన సమస్యలో ఒక మహిళ చిక్కుకున్నపుడు ఆ మహిళ తనను తాను కాపాడుకునేందుకు ఏ విధంగా నడుచుకుంటుందన్న కంటెంట్‌ ఆధారంగా ఇలాంటి చిత్రాలు తెరకెక్కుతాయి’’ అని వివరించింది.