Oct 17 2021 @ 00:37AM

తెలుగులో త్రిష వెబ్‌ సిరీస్‌

దక్షిణాదిలో అగ్ర కథానాయికలు సమంత, తమన్నా, కాజల్‌ అగర్వాల్‌, శ్రుతీ హాసన్‌, నిత్యా మీనన్‌ తదితరులు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడీ జాబితాలో త్రిష కూడా చేరుతున్నారు. తెలుగులో ఓ వెబ్‌ సిరీస్‌ చేస్తున్నారామె. ప్రొడక్షన్‌ డిజైనర్‌ అవినాశ్‌ కొల్లా, ఆయన సోదరుడు అశోక్‌ కొల్లా ‘అండ్‌ స్టోరీస్‌’ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు. తొలి ప్రయత్నంగా క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ నేపథ్యంలో ‘బృందా’ పేరుతో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌. సోని లివ్‌ ఓటీటీ వేదిక కోసం ఈ ప్రాజెక్టు చేస్తున్నారు. సాయికుమార్‌, ఆమని, ఇంద్రజిత్‌ సుకుమారన్‌, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌ సామి తదితరులు నటిస్తున్న ఈ వెబ్‌ సిరీస్‌కు స్ర్కిప్ట్‌ కన్సల్టెంట్‌: శశాంక్‌ వెన్నెలకంటి, మాటలు: జైకృష్ణ, స్ర్కీన్‌ప్లే: సూర్య వంగల, పద్మావతి మల్లాది, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాశ్‌ కొల్ల, సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌, రచన-దర్శకత్వం: సూర్య వంగల.