చట్టాలపై అవగాహన ఉండాలి

ABN , First Publish Date - 2021-10-21T05:30:00+05:30 IST

ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి వుండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి అన్నారు.

చట్టాలపై అవగాహన ఉండాలి

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 21: ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి వుండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.ప్రత్యూష కుమారి అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాజమహేంద్రవరం ఎస్‌కెఆర్‌ ఉమెన్స్‌ డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈనెల 2నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో న్యాయవిజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని, వీటిని ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకుని చట్టాలు, న్యాయపరమైన అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. అనంతరం ఉచిత న్యాయం సహాయం, ఆస్తి హక్కు, వివిధ చట్టాలను వివరించారు. సదస్సులో ప్యానల్‌ అడ్వకేట్‌ పెరిచర్ల సూర్యప్రభావతి, ఎల్‌ ఓంకార్‌, పారా లీగల్‌ వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-21T05:30:00+05:30 IST